Mahaesh Babu: మహేష్ బాబు ఈ పేరు వింటేనే చాలా మంది మదిలో వైబ్రేషన్స్ మోగుతుంటాయి. టాలీవుడ్ కలల రాకుమారుడిగా అమ్మాయిల మనస్సులను కొల్లగొట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్ దాకా ఎదిగాడు మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. నాలుగేళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు.

బాల నటుడిగానే 9 సినిమాల్లో నటించాడు. అప్పుడే.. మహేష్ బాబుకు ఎనలేని క్రేజ్ ఉండేది. అయితే చదువు పాడుకాకూడదనే ఉద్దేశ్యంతో కృష్ణ, మహేష్ బాబును కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంచారు. అయితే కృష్ణ మహేష్ బాబు కన్నా తన పెద్ద కొడుకు రమేష్ బాబును హీరోగా చేద్దాం అని అనుకున్నాడు కానీ.. రమేష్ బాబుకు అనుకున్నంత ఆదరణ రాలేదు.

అయితే మహేష్ బాబును ’రాజకుమారుడు‘ గా తొలిసారిగా హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఆ సమయంలో నాలుగైదు సినిమాల వరకు కృష్ణగారే స్టోరీలను విని ఫైనలైజ్ చేసేవారట. ఆ తరువాత నుంచి మహేష్ బాబే స్వయంగా స్టోరీలను విని ఒప్పుకొవడం మొదలు పెట్టారని ఓ నిర్మాత చెప్పుకొచ్చారు.
ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించి ప్రోడ్యూసర్:
రాశీ మూవీస్ అధినేత సీనియర్ నిర్మాత నరసింహ రావు.. మహేష్ బాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. మహేష్ బాల నటుడిగా ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆటైంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నానని.. ఆసమయంలో ఆయన శోభన్ బాబుతో వేరే సినిమా చేస్తుండటంతో వేరే వారి దర్శకత్వంలో గూడాచారి 117 కృష్ణ గారితో చేశానన్నారు.
ఆ మూవీలో బాల నటుడిగా మహేష్ బాబు కూడా నటించాడని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు సైకిల్ పై తిరిగే సమయంలోనే ఆయనకు నేను రూ. 500 అడ్వాన్స్ గా ఇచ్చానని.. మీ డేట్లు కావాలని అడిగానన్నారు. అయితే డేట్స్ అంటే ఏమిటని మహేష్ నన్ను ప్రశ్నించారని నిర్మాత నరసింహ రావు గుర్తు చేసుకున్నారు. మహేష్ స్టార్ అయ్యాక ఓసారి కలిశామని.. మంచి సబ్జెక్ట్ ఉంటే తీసుకురమ్మని సినిమా చేద్దాం అన్నారని ఆయన వెల్లడించారు.


































