సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు హిట్ అయితేనే హరోలకు అయినా.. సినీ దర్శకులకు అయినా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హీరోలు కాస్త బెటర్ అనే చెప్పాలి. ఒక్క సినిమా ఫ్లాప్ అయిందంటే.. తర్వాత సినిమాపై అంతగా ఎఫెక్ట్ చూపకపోవచ్చు. కానీ దర్శకుల విషయానికి వస్తే అలా కాదు.

వరుస సినిమాలు హిట్ కొట్టినా.. మరుసటి చిత్రం ప్లాప్ అయిందంటే.. అతడి వెంట నిర్మాతలు కన్నెత్తి కూడా చూడరు. ధైర్యం చేసి అతడితో సినిమా తీయడానికి అస్సలు ముందుకు రారు. అయితే ఈ అనుభవం బోయపాటి శ్రీనుకు ఎదురైంది. వరుస సినిమాలతో ఊపు మీదున్న బోయపాటికి వినయ విధేయ రామ పెద్ద డిజాస్టర్ అయింది.
దీంతో అతడితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. అంతక ముందు బోయపాటి సినిమాకు రూ.5కోట్లు తీసుకునేవాడు. కానీ ఒక్క ప్లాఫ్ తో సీన్ రివర్స్ అయిపోయంది. అప్పటి వరకు సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకున్న బోయపాటి.. తాజాగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ స్పష్టిస్తున్న అఖండకు మాత్రం తీసుకోలేదట. ఈ సినిమా రూ.70కోట్లతో రూపొందుతుందని.. ముందుగానే నిర్మాతకు చెప్పాడట.
బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. దాని కారణంగానే శ్రీను ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. సినిమా విడుదల తర్వాత మాత్రం లాభాల్లో షేర్స్ ఇస్తారని సమాచారం. ఇక అఖండ కలెక్షన్ల సునామీలో బోయపాటికి దాదాపు రూ.10 కోట్ల వరకు లాభం రావొచ్చనేది టాక్.
































