Naga Chaitanya: అక్కినేని వారసుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన అనంతరం నటి సమంతతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా నాగచైతన్య సమంత వైవాహిక జీవితంలో నాలుగు సంవత్సరాలు పాటు అన్యోన్యంగా ఉన్నప్పటికీ వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇలా నాగచైతన్య సమంత విడిపోగా వీరిద్దరూ ప్రస్తుతం వారి కెరియర్ గురించి ఆలోచిస్తూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే నాగచైతన్య రెండవ పెళ్ళికి సిద్ధమయ్యారని ఆయన మరొక హీరోయిన్ శోభిత ధూలపాళ్ళ అనే నటితో డేటింగ్ లో ఉన్నారనే వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి.వీరిద్దరూ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారని ఈ పరిచయం ప్రేమగా మారిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి.

ఈ విధంగా నాగచైతన్య డేటింగ్ రూమర్స్ వైరల్ కావడంతో కొంతమంది చైతన్య అభిమానులు సమంతను విమర్శిస్తూ ట్రోల్ చేశారు. ఈ విధంగా సమంత తన గురించి ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అదేవిధంగా నటి శోభిత సైతం ఈ వార్తలపై స్పందిస్తూ మిడిల్ ఫింగర్ చూపించి అందరికీ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.అయితే ఈ విధంగా చైతన్య డేటింగ్ రూమర్స్ రావడానికి గల కారణం చిన్న పొరపాటేనని చెప్పాలి.
ఫేక్ అకౌంట్ తో సమంతపై విమర్శలే కారణం…
శోభిత అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి ఆ అకౌంట్ ద్వారా సమాంతను విమర్శిస్తూ కామెంట్ పెట్టడమే ఈ పరిణామాలకు దారి తీసిందని చెప్పాలి.ఇలా శోభిత అనే అకౌంట్ నుంచి సమంత పై విమర్శలు రావడంతో శోభిత నాగచైతన్య డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే అది ఫేక్ అకౌంట్ అని తెలియడంతో ఈ వార్తలకు పూర్తిగా పులి స్టాప్ పడింది.


































