బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో భాగంగా మరింత చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. గత 4 రోజుల క్రితం ముంబై తీరంలోని క్రూయిజర్ షిప్ డ్రగ్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ నేటి వరకు కస్టడీలో ఉంచాలని కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్యన్ తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు ప్రస్తుతం వీరి సెల్ ఫోన్లు సీజ్ చేసి అందులో డేటాను పరిశీలిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆర్యన్ ఫోన్ పరిశీలించి అధికారులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వీరి మొబైల్ ఫోన్‌లు గాంధీ నగర్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి డేటాను ట్రేస్ చేయగా ఆర్యన్ ఫోన్లో షాకింగ్ సీక్రెట్స్ బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఆర్యన్ ఫోన్ లో ఫోటోలు అశ్లీల వీడియోలు బయటపడినట్లు తెలియజేశారు.
ఇలా డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తన ఫోన్లో అశ్లీల వీడియోలు బయటపడటంతో ఆర్యన్ మెడకు ఉచ్చు బిగించినట్లయింది. అదేవిధంగా ఎన్సీబీ అధికారులు చెబుతున్న ప్రకారం ఆర్యన్ ఎప్పటినుంచో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తన స్నేహితుల ద్వారా డ్రగ్స్ కొనుగోలు కూడా చేశారని తెలుస్తోంది.
ఆర్యన్ డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసి క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు చెల్లించినట్లు అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఎన్సీబీ అధికారులు ఇతని బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్యన్ గురించి పలు విషయాలు బయట పడటంతో ఇతనికి ఇప్పుడప్పుడే బెయిల్ వస్తుందా లేక మరికొన్ని రోజులు కస్టడీలోనే ఉంచనున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.































