సాధారణంగా మన శరీరానికి పెరుగు, పాలు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు పాలు,ఆహారంతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం సక్రమంగా అందుతుందని భావిస్తాము. ఈ విధంగా పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కానీ కొన్ని సార్లు మన పెద్దవారు రాత్రిపూట పెరుగు తినకూడదని హెచ్చరిస్తుంటారు. రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తుతాయని పెద్దలు చెబుతుంటారు.నిజంగానే రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు బారిన పడే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే రాత్రిపూట పెరుగు తినడం వల్ల కొందరిలో కొన్ని సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెరుగు తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు:

  • సాధారణంగా పెరుగు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు ఫ్రిజ్లో పెడుతుంటారు. అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ లో ఉన్న పెరుగు తినడం వల్ల జలుబు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి పెరుగును బయటనుంచే తినాలి.
  • దగ్గు, జలుబు లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే రాత్రిపూట ఎటువంటి పరిస్థితులలో కూడా పెరుగును తినకూడదు.

*జలుబు, దగ్గు చేసినప్పుడు పెరుగు తినటం వల్ల కఫం ఏర్పడుతుందని, దీనివల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతాయని చెబుతున్నారు.

  • ఒకవేళ తప్పనిసరిగా పెరుగుతో తినాలనిపిస్తే పెరుగు బదులు పల్చటి మజ్జిగ తాగడం ఎంతో ఉత్తమం. అదే విధంగా రాత్రి వేళల్లో పెరుగు తినాలనిపిస్తే అందులోకి కొద్దిగా చక్కెర, నల్లటి మిరియాల పొడి కలుపుకొని తినడం వల్ల పెరుగును తొందరగా జీర్ణం చేస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here