Shraddha Das: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో ఒకటి.ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతూ ఎంతో మంది డాన్సర్లను పరిచయం చేసింది. ఇలా బుల్లితెరపై ప్రసారమవుతు దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న వారిలో హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ ఒకరు.శ్రద్ధాదాస్ నటిగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోని ఈమె ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి ఒక హీరోయిన్ న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తుండడంతో ఈమె రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా కథనాల ప్రకారం శ్రద్ధాదాస్ ఒక్కో ఎపిసోడ్ కు సుమారు 3.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Shraddha Das: భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శ్రద్ధాదాస్..
ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు ఎపిసోడ్లకు ఒకరోజు షూటింగ్ జరుగుతుందని ఇలా ఈమె రెండు ఎపిసోడ్లకు ఏడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. వెండితెరపై ఈమెకు అవకాశాలు లేకపోయినా బుల్లితెరపై ఇలా పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తున్నారని, ఇలా బుల్లితెర అభిమానులను కూడా సంపాదించుకున్నారని తెలుస్తోంది.
































