Shruthi Hassan: పెళ్లికి ముందు తల్లయితే తప్పేంటి… నటి శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్!

0
123

Shruthi Hassan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ ఏడాది ఏకంగా వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీని ప్రకటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నటి శృతిహాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా పెళ్లికి ముందే తల్లి కావడం గురించి మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది. అయితే ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ పెళ్లికి ముందే తల్లి అయితే తప్పేంటి…కేవలం ఆడవారు మాత్రమే పిల్లలకు జన్మనివ్వగలరు అయితే ఎప్పుడు పిల్లలకు జన్మనివ్వాలి అన్నది పూర్తిగా వారి నిర్ణయమేనని శృతిహాసన్ ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Shruthi Hassan: ఒకప్పుడు ఎంతో బాధపడేదాన్ని.


ఇకపోతే శృతిహాసన్ సైతం పెళ్లికి ముందే జన్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు ఈమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ హద్దులు దాటి తనపై ట్రోల్స్ చేస్తున్నారు.ఇలా శృతిహాసన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినప్పటికీ తాను తన గురించి వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని ఒకప్పుడు ఈ విమర్శల గురించి ఆలోచిస్తూ బాధపడేదాన్ని కానీ ఇప్పుడు వాటి గురించి అస్సలు ఆలోచించను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.