Shruti Haasan : కమల్ హాసన్, సారిక కూతురు శృతి హాసన్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో అనగనగా ఒక ధీరుడు సినిమాతో పరిచయమై ఆ తరువాత టాప్ హీరోయిన్ గా అందరు హీరోలతో ఆడిపాడింది. అటు నటన, ఇటు డాన్స్ మరో వైపు పాటలు ఇలా అన్నింటా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ జోరు తగ్గి సినిమాలు తగ్గాయి. మళ్ళీ క్రాక్ సినిమాతో కాక పుట్టించిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ తెలుగులో వరుస అవకాశాలతో బిజీగా ఉంది.

పిసిఓఎస్, ఎండ్రోమెట్రిసిస్ తో బాధపడుతున్న శృతి…
ప్రస్తుతం శృతి ప్రభాస్, ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా, చిరంజీవి తో మరో సినిమాలో నటిస్తోంది. ఇలా మళ్ళీ తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శృతి సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కబుర్లను బాగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ హాజరిక తో సహజీవనం చేస్తున్న ముద్దుగుమ్మ రీసెంట్ గా తాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో బాధపడుతున్నానని పిసిఓఎస్, మరియు ఎండ్రోమెట్రిసిస్ ఉన్నాయని అభిమానులతో పంచుకుంది.

మహిళలకు వీటితో పోరాడడం, చాలా కష్టమైన పనే కానీ అసాధ్యమైతే కాదంటూ మోటివేషన్ ఇచ్చింది. ఇక తన ఫిట్ నెస్ వీడియోను షేర్ చేస్తూ తన లాగే పిసిఓఎస్, ఎండ్రోమెట్రిసిస్ తో పోరాడేవాళ్లకు ధైర్యాన్ని ఇస్తోంది శృతి. చాలా మంది సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్లు తమకున్న లోపాలను జబ్బులను చెప్పుకోడానికి ఆలోచిస్తారు, వారి కెరీర్ పై అది ఎలా ప్రభావం చూపుతుందో అని భయపడతారు. కానీ శృతి అలా కాకుండా ఇలా ఓపెన్ గా తన సమస్యను చెబుతూ పాజిటివ్ గా ఆలోచిస్తూ తనలా ఆ సమస్యలతో బాధపడేవాళ్లకు ధైర్యాన్నివ్వడం చాలా బాగుందంటూ చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






























