Shruthi Hassan: శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలకు కూడా ఈమె కామెంట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

తాజాగా ఈమె ఫ్లూ బారిన పడ్డారని తెలుస్తుంది దీంతో ఇంటిపట్టునే ఉన్నారు ఈ క్రమంలోనే సరదాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇలా నేటిజన్స్ ఈమెను ప్రశ్నిస్తూ వింత వింత ప్రశ్నలు వేశారు.
ఒక నెటిజన్ నువ్వు సింగిలా అని ప్రశ్నించగా ఎందుకు అంటూ ఎదురు సమాధానం వేసింది. దీంతో మరొక నెటిజన్ నాకు లవర్ గా ఉంటావా అంటూ ప్రశ్నించారు. నో అంటూ సమాధానం చెప్పింది ఈ క్రమంలోనే మరొక నైటిజన్ తెలుగు సినిమాలలో ఎప్పుడు నటిస్తావు అంటూ ఈమెను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఇదేం వింత ప్రశ్న పిచ్చి గాని పట్టిందా గత ఏడాదే కదా మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాను అంటూ సమాధానం చెప్పారు.
నోరు విప్పి మాట్లాడాలి..
ఇక మరొక నెటిజన్ డిప్రెషన్ నుంచి బయటపడటం కోసం సలహాలు ఇవ్వమని కోరారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ డిప్రెషన్ నుంచి బయటపడటం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి సమయంలో మనం నోరు విప్పి మాట్లాడాలి. ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే డిప్రెషన్ నుంచి బయటపడగలము అంటూ శృతిహాసన్ నేటిజన్స్ ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు.



























