Prabhas: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ప్రభాస్. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటివరకు సింగిల్ గానే ఉన్నారు.

ఇలా ప్రభాస్ నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఈయన పెళ్లి గురించి తరచూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ప్రభాస్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సక్సెస్ కారని చాలామంది చెప్పారు. కానీ ఇప్పుడు కల్కి సినిమాతో అంతకుమించిన విజయం అందుకున్నారని శ్యామల దేవి తెలిపారు. ఇక పెళ్లి విషయంలో కూడా అదే జరుగుతుందని తెలిపారు.
మాకు పెళ్లి చేయాలని ఉంది..
మా బిడ్డకు పెళ్లి చేయాలని మాకి ఉంటుంది కానీ సరైన సమయం వస్తే తప్పకుండా పెళ్లి జరిగి తీరుతుంది అంటూ ఈ సందర్భంగా శ్యామల దేవి ప్రభాస్ పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ప్రభాస్ పెళ్లి సమయం ఎప్పుడు వస్తుంది ఆయన ఎప్పుడు ఈ శుభవార్తను చెబుతారా అని అభిమానులు అందరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.



























