Shyamala: గతంలో వైకాపా పార్టీకి మద్దతు తెలిపిన యాంకర్ శ్యామల పట్ల సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూటమి కార్యకర్తలు ఆమె పట్ల వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఈమె వైకాపా పార్టీలో కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తనపై వస్తున్నటువంటి అనుచిత పోస్టులను ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి బహిర్గతం చేశారు.

సోషల్ మీడియాలో కొందరు నా పర్సనల్ ఫోన్ నెంబర్ లీక్ చేయడంతో ప్రతిరోజు తనకు 900కు పైగా మిస్డ్ కాల్స్ వస్తున్నాయని అది చాలా తక్కువలో తక్కువ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకపోతే ఎంతోమంది అసభ్యకరంగా మూకుమ్మడిగా నాపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల ద్వారా దాడి చేస్తున్నారని తెలిపారు. ఆ పోస్టులు చదవడానికి కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయని తెలిపారు.
కేవలం నన్ను మాత్రమే కాకుండా నా భర్త అలాగే నా కుటుంబ సభ్యుల పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఫోన్ లిఫ్ట్ చేయవే అంటూ బూతులు తిడుతున్నారు. ఇక మరికొందరు నీ రేటెంత అంటూ దారుణంగా మాట్లాడుతున్నారని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా దుర్వినియోగ రక్షణ బిల్లును తీసుకువస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు.

Shyamala: యువగళం స్ఫూర్తిగా…
ఈ రక్షణ బిల్లు ఎవరికోసం కేవలం కూటమి నేతల కోసమేనా మరి నా గురించి ఇలా సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు చేసిన వారిపట్ల చర్యలు తీసుకోరా అంటూ ఈమె ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై ఏపీలోని కూటమి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. నారా లోకేష్ గారి యువగళం స్ఫూర్తిగా చేసుకొని ఇలాంటి పోస్టులు, ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఈమె మండిపడ్డారు.





























