Siddharth: సౌత్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. తెలుగు, తమిళ్ భాషలలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సిద్ధార్థ్ లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి లవర్ బాయ్ గా గుర్తింపు పొందాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సిద్దార్థ్ ప్రస్తుతం లవ్ స్టోరీస్ కి బ్రేక్ చేస్తూ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేశారు. ప్రస్తుతం టక్కర్ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావటానికి సిద్ధంగా ఉన్నాడు.

కార్తిక్ క్రిష్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో సిద్దార్థ్ కి జోడీగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా టక్కర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సిద్ధార్థ లవ్ స్టోరీ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ..’ ప్రేమకథ అనేది భావోద్వేగంతో కూడిన, అలసిపోయే ప్రయాణం. ఒక్కసారి ఆ సినిమాలు చేస్తే అలాంటి సినిమాలలోనే నటించాలని ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం ఉంది. నేను లవ్ స్టోరీస్ చేస్తే, రాబోయే దశాబ్దం వరకు నాకు అలాంటి అవకాశాలే వచ్చే ప్రమాదం ఉంది.అందుకే ఇకపై లవ్ స్టోరీస్ కి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు సిద్ధార్థ్ తెలిపాడు.

Siddharth: నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది..’
ఇక బొమ్మరిల్లు 2 గురించి కూడా సిద్దార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “బొమ్మరిల్లుసినిమాకి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని.. ఆ సినిమాలోని భావోద్వేగాలకు మించిన భావోద్వేగాలను అందిండం చాలా కష్టమైన పని. ఒకవేళ అలాంటి ఎమోషన్స్ అందించగలమని, నేటి ట్రెండ్‌కి సరిపోయే కథ వచ్చినప్పుడు చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీబొమ్మరిల్లుమ్యాజిక్‌ని సీక్వెల్‌లో పునఃసృష్టి చేయడం చాలా కష్టమైన పని అని సిద్దార్థ్ వెల్లడించాడు. దీంతో ఇంతకాలం బొమ్మరిల్లు-2 సినిమా మీద అభిమానులు పెట్టుకున్న ఆశలు నెరవేరేలా కనిపించటం లేదు.






























