Siddharth Varma: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది బుల్లితెర సెలబ్రిటీలు పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వారికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటీనటులుగా గుర్తింపు పొందిన సిద్ధార్థ వర్మ విష్ణు ప్రియ పలు సీరియల్స్ లో నటించి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నటి విష్ణు ప్రియ పుట్టిన రోజు కావడంతో తన భర్త తనకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా షాపింగ్ వెళ్ళిన విష్ణు ప్రియ తనకు నచ్చినటువంటి బంగారు నగలను కొనుగోలు చేశారు.ఈ విధంగా తనకు నచ్చిన గాజులు నెక్లెస్ ఇయర్ రింగ్స్ అన్ని కొనుగోలు చేసిన ఈమె బిల్లు మాత్రం తన భర్త చేత కట్టించారు.
ఈ విధంగా తాను కొన్న నగలను సుమారు 200 గ్రాములకు పైగా ఉన్నాయని తెలియజేస్తూ వాటికి డబ్బులను మాత్రం తన భర్త సిద్ధార్థ వర్మ చేత కట్టించి తన పుట్టినరోజు కానుకగా తన భర్త తనకు బంగారు నగలు కొనిచ్చారంటూ ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోని షేర్ చేశారు. ఈ విధంగా విష్ణు ప్రియ ఈ వీడియోని షేర్ చేస్తూ నా బర్తడే కు మా వారి బంగారు కానుక అంటూ ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

Siddharth Varma: ప్రేమించి సిద్ధార్థ వర్మను పెళ్లి చేసుకున్న విష్ణు ప్రియ..
ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈమె ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మల్లికా పాత్రలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సీరియల్స్ లో నటిస్తూనే నటుడు సిద్ధార్థ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.

































