చక్కెర ను వైట్ పాయిజన్ అని ఎందుకంటారో తెలిస్తే.. ఇకపై ఎప్పుడు కూడా చక్కెర ముట్టరు!

0
310

సాధారణంగా మన రోజువారి జీవితంలో ఉపయోగించే వాటిలో చక్కెర ఒకటి. ప్రతిరోజు కాఫీ, టీలలో చక్కెరను విరివిగా ఉపయోగిస్తారు.అదేవిధంగా వివిధ రకాల తీపి పదార్థాలను తయారు చేసుకోవాలన్న చక్కెరతోనే ఎక్కువగా తయారు చేసుకుంటాము.ఈ విధంగా రోజుకు అధిక మొత్తంలో చక్కెరను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అయితే చక్కెర తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రతి రోజు అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల శరీర బరువు అమాంతం పెరిగిపోతారు. అదే విధంగా ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడటానికి కూడా చక్కెర ప్రధాన కారణం.మనం ఏదైనా తీపి పదార్థాలు తిన్నప్పుడు అందులో ఉన్నటువంటి చక్కెర మన శరీరంలో ఉన్నటువంటి కొల్లాజెన్ కి అతుక్కుంటుంది. ఇది నెమ్మదిగా ప్రోటీన్లను తొలగించడంతో మన చర్మం పై ముడతలు మచ్చలు ఏర్పడతాయి.

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలో ఊబకాయం ఒకటి. ఊబకాయం అనేది మనం చక్కెర తినకపోయినా ఇతర రకాల పానీయాలు చాక్లెట్ వంటి వాటిని తిన్నప్పుడు వాటిలో ఉన్న చక్కెర మన శరీరంలోకి ప్రవేశించి ఊబకాయానికి దారితీస్తుంది. అదేవిధంగా అధిక మొత్తంలో చక్కెర తీసుకున్నప్పుడు కాలేయ సమస్యలకు దారితీస్తుంది.

ప్రతి రోజు అధిక మొత్తంలో చక్కెర తీసుకోవటంవల్ల గ్లూకోస్ పూర్తిగా మెదడుకు చేరకపోవడం వల్ల మెదడు తన పనితీరును కోల్పోతుంది. ఇది క్రమంగా జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకోసమే రోజువారి ఆహారంలో భాగంగా చక్కెరను మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల ఈ విధమైన దుష్ప్రభావాల కారణంగానే చక్కెరను వైట్ పాయిజన్ అని పిలుస్తారు.