గత ఏడాది కాలం నుంచి మనం ఎక్కువగా వింటున్న పదం రోగనిరోధక శక్తి. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలమని తెలుసుకోవడంతో ప్రతి ఒక్కరు వారి శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని తినడం, కషాయాలు తయారు చేసుకొని తాగడం వంటివి చేస్తున్నప్పటికీ కొందరు కరోనా వైరస్ బారిన పడుతున్నారు.అయితే మన శరీరంలో ఎంత పరిమాణంలో రోగనిరోధకశక్తి ఉంది అనే విషయం మనకు తెలియదు కనుక మన శరీరానికి సరిపడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరి ఆ లక్షణాలు ఏమిటి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో తెలుసుకుందాం…

జీర్ణ సమస్యలు అధికమవడం: మన శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తి లేకపోవడంతో మన శరీరంలో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.మన శరీరానికి రోగనిరోధకశక్తిని పెంపొందించే బ్యాక్టీరియాలు ఎక్కువగా పెద్ద ప్రేగులలో నిల్వ ఉంటాయి. కనుక రోగ నిరోధక శక్తి తక్కువ అయినప్పుడు వీటి పనితీరు క్రమంగా నశించి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే మలబద్ధకం, గ్యాస్ ఏర్పడటం, విరోచనాలు కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో ఎక్కువ భాగం ఫైబర్, ప్రోటీన్, పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. పూర్తిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

గాయాలు ఆలస్యంగా మానడం:
మన శరీరానికి సరిపడే రోగనిరోధక శక్తి ఉండటం వల్ల మన శరీరంలో ఏవైనా చిన్న గాయాలు తగిలిన వెంటనే రోగనిరోధకశక్తి స్పందించి గాయంపై కొత్త చర్మకణాలను ఏర్పడేలా చేస్తుంది. ఈ క్రమంలోనే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే కొత్తగా చర్మకణాలను పునరుత్పత్తి చేయలేవు తద్వారా గాయాలు ఆలస్యంగా నయమవుతాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఎక్కువగా విటమిన్ డి , సి, జింక్ సమతుల్య స్థాయిలో తీసుకుంటే.. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. గాయాలు త్వరగా నయమవుతాయి.

అలసట:
మనం ప్రతి రోజూ సుమారుగా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోతున్నప్పటికీ మనలో తెలియని అలసట కలుగుతుంది.ఈ విధంగా తరచు అలసి పోతున్నట్లు అనిపిస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని అర్థం. ఈ విధమైనటువంటి సమస్య ఎదురైనప్పుడు వీలైనంతవరకు పని ఒత్తిడి తగ్గించడం, యోగ ధ్యానం వంటి వాటిని చేయడం ద్వారా గుండె పనితీరు మెరుగుపడి రక్త ప్రసరణ వ్యవస్థ సవ్యంగా జరగడంతో మన శరీరంలో అలసటను కలిగించే థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తాయి. తద్వారా మనం శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అలసట అనేది ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here