మలేరియా అనేది దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతుంది. మలేరియా వ్యాధిని సర్వసాధారణమైన జ్వరం అని భావిస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వ్యాధి తీవ్రత అధికమైతే మరణం కూడా సంభవిస్తుంది.అయితే ఇటువంటి ప్రమాదకరమైన వ్యాధిని అరికట్టడం కోసం కొన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా దోమలు కుట్టకుండా మన ఇంటి పరిసరాలలోనూ, ఇంటిలో ఎంతో పరిశుభ్రతను పాటించడం వల్ల దోమలను నివారించవచ్చు. అదేవిధంగా మలేరియాని కూడా అరికట్టవచ్చు. మలేరియా ఎక్కువగా చిన్నపిల్లలు, గర్భిణి స్త్రీలలో అధికంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఇటువంటి ప్రమాదకరమైన మలేరియాను కొన్ని ఇంటి నివారణ పద్ధతులను ఉపయోగించి ఎదుర్కోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

దాల్చిన చెక్క:
మన ఇంట్లో దొరికే మసాలా దినుసులలో దాల్చిన చెక్క ఒకటి. ఇది కేవలం వంటకు రుచిని మాత్రమే ఇవ్వకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల మలేరియా వంటి వ్యాధి లక్షణాలతో పోరాడుతుంది. మలేరియా లక్షణాలు మనలో కనిపిస్తే కొద్దిగా దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆరెంజ్ జ్యూస్:
మలేరియాతో బాధపడేవారికి ఆరెంజ్ జ్యూస్ ఎంతో కీలకమైనది. భోజనానికి భోజనానికి మధ్య సమయంలో ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల జ్వరం నుంచి విముక్తి కల్పిస్తుంది. అదేవిధంగా ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మలేరియాతో బాధపడేవారికి ఆరెంజ్ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

అల్లం టీ:
మలేరియా వంటి వ్యాధుల లక్షణాలతో బాధ పడుతున్నప్పుడు అల్లం టీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి ఔషధ గుణాలు ఉండటం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియాతో పోరాడుతుంది. బాగా మరుగుతున్న నీటిలో అల్లం ముక్కలను వేసి మరిగించాలి. దీనిని వడబోసి త్రాగటం వల్ల మన శరీరంలో ఏర్పడిన వ్యాధికారక బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.

నిమ్మరసం:
మలేరియా వ్యాధి లక్షణాలతో బాధపడేవారికి నిమ్మరసం ఒక మంచి చిట్కాఅని చెప్పవచ్చు. మలేరియా వ్యాధితో బాధపడేవారిలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో నిమ్మరసం కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా నిమ్మలో విటమిన్ సి ఉండటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here