Simran: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సీనియర్ నటి సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళ్ కన్నడ భాషలలో ఎంతోమంది స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన సిమ్రాన్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తోంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సిమ్రాన్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అప్పుడప్పుడు తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా వేదికగా చెల్లిని తలుచుకొని సిమ్రాన్ షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సౌత్ ఇండియా స్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సిమ్రాన్ తన చెల్లిని కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చింది. 2000 సంవత్సరంలో ‘ఇంద్ర ధనుష్’ అనే కన్నడ సినిమా ద్వారా సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావల్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ భాషలో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.
తెలుగులో కూడా ఇష్టం అనే సినిమాలో ఒక పాటలో నటించింది. ఇదిలా ఉండగా హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కొరియోగ్రాఫర్ తో మోనాల్ ప్రేమలో పడింది. అయితే ఆ ప్రేమ విఫలం కావడంతో 2002 ఏప్రిల్ 14 వ తేదీన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. నిన్నటికి మోనాల్ మరణించి సరిగ్గా 20 సంవత్సరాలు కావటంతో చెల్లిని తలుచుకొని సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Simran: ప్రేమకు గుర్తుగా…
ఈ క్రమంలో చిన్నప్పుడు చెల్లితో కలిసి ఉన్న ఫోటోతో పాటు మరొక ఫోటోని కూడా షేర్ చేస్తూ.. ‘‘ మా అందమైన చెల్లెలు మోనాల్ ప్రేమకు గుర్తుగా.. నిన్ను ఎప్పుడూ మర్చిపోలేము’’ అంటూ రాసుకొచ్చింది . ప్రస్తుతం సిమ్రాన్ షేర్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
In loving memory of my beautiful sister Monal. You’ll be never forgotten ???? pic.twitter.com/4E78Ol6PZz
— Simran (@SimranbaggaOffc) April 14, 2023
































