Simran: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సిమ్రాన్ ఒకరు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందుకున్నారు. ఇక ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా సిమ్రాన్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో కొరియోగ్రాఫర్ రాజు సుందరం మాస్టర్ ప్రేమలో పడ్డారట. ఇలా వీరిద్దరూ పీకల్లోకి ప్రేమలో మునిగిపోయారు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని తెలుస్తోంది. అయితే వీరి బ్రేకప్ కి ఒక హీరో కారణమని తెలుస్తోంది.
సిమ్రాన్ తమిళంలో కమల్ హాసన్ తో కలిసి వరుసగా మూడు సినిమాలలో నటించారు. ఇలా వరుస సినిమాలు రావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే రూమర్లు పుట్టాయి. ఇలాంటి రూమర్లు రావడంతో రాజు సుందరం మాస్టర్ రొమాంటిక్ సన్నివేశాలలో నటించద్దని సిమ్రాన్ కి చెప్పారట అయినప్పటికీ సిమ్రాన్ కమల్ హాసన్ తో కలిసి ఒక లిప్ లాక్ సన్నివేషంలో కూడా నటించారట.
దీపక్ బగ్గా..
ఇక ఇండస్ట్రీలోనే ఉన్నటువంటి రాజు సుందరం మాస్టర్ కు హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ ఆమెకు కండిషన్లు పెట్టడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని దీంతో వీరిద్దరూ కలిసి ఉండటం అసంభవం అని భావించి బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. ఇలా సిమ్రాన్ బ్రేకప్ గురించి ఎక్కడ చెప్పకపోయినా ఈ వార్తలు మాత్రం అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో మారుమోగిపోయాయి. ఈయనతో బ్రేకప్ అనంతరం సిమ్రాన్ దీపక్ బగ్గా అనే వ్యక్తిని పెళ్లాడింది.



























