Singanamala: ఆంధ్రప్రదేశ్లో కేవలం రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉందనే సంగతి మనకు తెలిసిందే. కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ జరుగుతుంది కానీ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో మాత్రం త్రిముక పోటీ ఉందని చెప్పాలి. ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ రేసులో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతోంది.

ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత పలు ప్రాంతాలలో కాంగ్రెస్ సభ్యులు కూడా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈ క్రమంలోనే సింగనమల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి శైలజనాథ్ ఎన్నికల బరిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈయన ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావణి వైయస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులకు గట్టి పోటీ ఇస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బండారు శ్రావణి గత ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు అయితే ఆమె ఓటమిపాలయ్యారు. ఇక గత ఎన్నికలలో వైసిపి నుంచి జొన్నలగడ్డ పద్మావతి విజయకేతనం ఎగరవేశారు. అయితే ఈమెకు ఈసారి నెగిటివ్ రివ్యూ రావడంతో తన వద్ద పనిచేస్తున్నటువంటి వీరాంజనేయులుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇప్పించారు.
గట్టి పోటీ ఇస్తున్న మాజీ మంత్రి..
టిప్పర్ డ్రైవర్ గా కొనసాగుతున్నటువంటి ఈయన ప్రచార కార్యక్రమాలలో కూడా దూకుడు పెంచారు. అయితే రెండుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి శైలజ నాథ్ మాత్రం తన హయామంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాలలో దూసుకుపోతున్నారు. అన్ని నియోజకవర్గాలలో ద్విముఖ పోటీ ఉండగా.. ఇక్కడ మాత్రం త్రిముక పోటీ ఉంది .మరి ఈ ఎన్నికలలో సింగనమల నియోజకవర్గంలో ఎవరు విజయ కేతనం ఎగురవేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది.





























