Singer Chinmayi: సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలో ఎంతో బిజీ ఆర్టిస్ట్ గా గడుపుతున్నటువంటి ఈమె 2014వ సంవత్సరంలో నటుడు రాహుల్ రవీందర్ ను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇలా వీరిద్దరి వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాలకు ఈ దంపతులకు కవల పిల్లలు జన్మించారు.

ఇలా చిన్మయి తనకు కవల పిల్లలు జన్మించారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించకుండా నేరుగా పిల్లల గురించి తెలియజేయడంతో ఈమె సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇలా తనపై విమర్శలు రావడంతో చిన్మయి స్పందించారు.
ఈ క్రమంలోనే తాను సరోగసి ద్వారా పిల్లలను కనలేదని ఏకంగా తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా పిల్లలు జన్మించిన తర్వాత వారితో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇప్పటివరకు తమ పిల్లల ఫోటోలను ఎక్కడ బయట పెట్టలేదు. అయితే తాజాగా ఈమె తన ఇద్దరి పిల్లల ఫోటోలను రివిల్ చేశారు.

Singer Chinmayi: ఏడాది పూర్తి…
ఈ క్రమంలోనే తన పిల్లలకు నేటితో ఏడాది పూర్తి అయ్యి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఈమె తన పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది ఒక గొప్ప ఆశీర్వాదం అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం చిన్మయి పిల్లలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతో మంది అభిమానులు చిన్మయి పిల్లలు చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.































