Singer Daniel : ఎన్ని కష్టాలుపడినా జీవితంలో ఒక గుర్తింపు దొరికినపుడు ఆ కష్టాన్ని మర్చిపోతాము. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఆర్టిస్టులు, సింగర్స్ లాంటి వాళ్లకు ఒక ఛాన్స్ చాలా విలువైనది తమ టాలెంట్ తో జీవితాన్ని మర్చికోడానికి. ఇలానే పేదవాడిగా కష్టాలు పడి పైకొచ్చిన డేనియల్ కు తన టాలెంట్ గుర్తింపును తెచ్చిపెట్టింది. నీ గొంతు చాలా అరుదుగా ఉంటుంది. నీలాంటి సింగర్ పరిశ్రమకు కావాలి వంటి ప్రశంసలు తనకు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలను మరచిపోయేలా చేస్తాయి.

హోటల్లో ప్లేట్లు కడిగాను… హాలీమ్ అమ్మాను…
చిన్నప్పటి నుండి పేదరికం లో బ్రతికిన డేనియల్, అయినా కూడా చదవు నిర్లక్ష్యం చేయలేదు. ఉండడటానికి ఇల్లు లేని సమయంలో కూడా చదువు ఆపలేదు. ఇక ఫీజులకు డబ్బులు సర్ధాల్సివచ్చినపుడు మేనత్త లేదా ఎవరైనా చందాలు వేసుకున్న సందర్భాలు ఉన్నాయంటూ డేనియల్ చెప్పాడు. ఇక చదువుకు డబ్బులను ఇంట్లో అడిగి వారిని కష్టపెట్టడం ఇష్టం లేక ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలని అనుకుని వైజాగ్ లో చదివే రోజుల్లో హోటల్ లో టేబుల్ తుడవడం, ప్లేట్లు ఎత్తడం వంటి పనులు చేసానని, అలా ప్లేట్లు ఎత్తి తుడిచెటప్పుడు కస్టమర్ మీద పడితే కొంతమంది తిట్టేవారని కానీ డబ్బుకోసం చేయాల్సి వచ్చిందని, ఇక తెలిసిన కాలేజ్ సీనియర్ హాలీమ్ అమ్మే పనిలో కుదుర్ఛాడని రోడ్డు పక్కన నిల్చొని హాలీమ్ హాలీమ్ అంటూ గట్టిగా అరిచి అమ్మేవాడినని, తెలిసిన వాళ్ళు చూసి ఎందుకు ఇలా చేస్తున్నానని అడిగినా నాకేమాత్రం ఇబ్బందిగా ఉండేది కాదు.

నేను కష్టపడి నా డబ్బు నేను సంపాదించుకుంటున్నా తప్పు చేయడం లేదుకదా అని అనుకునే వాడిని. ఆ తరువాత పరీక్ష రాసి నర్స్ గా ఎయిమ్స్ చత్తీష్ గఢ్ లో పని చేస్తున్నానని ప్రస్తుతం ఆర్థికంగా బాగున్నని చెప్పారు డేనియల్. సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇక తనకు సింగర్ అవ్వాలని పదకొండేళ్ల వయసులో అనిపించింది కానీ పరిస్థితుల వల్ల ఆలోచించలేదని మళ్ళీ ముప్పై ఏళ్లలో ఆ కల నెరవేర్చుకుంటున్నానని చెప్పారు. సరిగమప లో డేనియల్ పాటకు చాలా మంది అభిమానూలు ఉన్నారు.































