Singer Kalabhairava: కావాలని అలా చేయలేదు… ఎన్టీఆర్ చరణ్ అభిమానులకు కాలభైరవ క్షమాపణలు!

0
27

Singer Kalabhairava: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చినటువంటి త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పాటను కాలభైరవ రాహుల్ ఏకంగా ఆస్కార్ వేదికపై కూడా లైవ్ లో పాడారు. ఇక ఈ విషయం గురించి కాలభైరవ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోవడంతో తన సంతోషాన్ని తెలియజేస్తూ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి డైరెక్టర్ రాజమౌళి గారు నాన్న కీరవాణి పెద్దమ్మ అమ్మ అన్నయ్య కార్తికేయ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వీరి వల్లే నేను ఇంత గొప్ప అవకాశాన్ని అందుకోగలిగాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఇక ఈయన ఈ పోస్టులో ఎన్టీఆర్ రామ్ చరణ్ పేర్లను ప్రస్తావించకపోవడంతో వీరి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతూ కాలభైరవను ట్రోల్ చేస్తున్నారు.అసలు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ పాటకు కనుక డాన్స్ చేయకపోయి ఉంటే ఈ పాటకు ఇంత క్రేజ్ వచ్చేదా హీరోల పేర్లను మర్చిపోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఇలా తన గురించి భారీగా ట్రోల్స్ రావడంతో కాలభైరవ స్పందించారు.

Singer Kalabhairava: తప్పుగా భావించి ఉంటే క్షమించండి….

ఈ సందర్భంగా కాలభైరవ స్పందిస్తూ.. నేను ఎన్టీఆర్ రామ్ చరణ్ పేర్లను ప్రస్తావించకపోవడానికి కారణం ఉంది. ఈ పాట ఇంత మంచి సక్సెస్ అయ్యింది అంటే అందులో ఎన్టీఆర్ చరణ్ అన్న పాత్ర ఎంతగానో ఉందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ పాట నేను ఆస్కార్ వేదికపై పాడటానికి కృషి చేసిన వారి గురించి మాత్రమే ప్రస్తావించానని తెలిపారు. అయితే ఇది మరోలా అందరికీ కన్వర్ట్ అయిందని ఈ విషయంపై అభిమానులు బాధపడి ఉంటే తనని క్షమించండి అని ఉద్దేశపూర్వకంగా తాను అలా చేయలేదంటూ ఈయన క్షమాపణలు చెప్పారు.