Singer Kousalya : ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా… రా రమ్మని రారా రమ్మని అంటూ తెలుగు ప్రేక్షకులకు మనసు దోచుకున్న సింగర్ కౌసల్య. 99లో పాడుతా తీయగా సింగింగ్ షోలో విన్నర్ గా నిలిచి ఆపైన సినిమాల్లో అవకాశాలను అందుకుని సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కౌసల్య నిజ జీవితంలో మాత్రం భర్త వేధింపులకు చాలా బాధపడింది. చివరకు 2015లో విడాకులు తీసుకుని ప్రస్తుతం తాను ఒక్కతే కొడుకును చూసుకుంటూ కెరీర్ లోనూ ముందడుగు వేస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ కౌసల్య తన వ్యక్తిగత జీవితం గురించి అలానే తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు.

పెళ్లి చేసుకో పిల్ల అని అంటాడు…
కౌసల్య గారు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైనకొంత కాలానికే భర్త వేధింపులు మొదలయ్యాయి. కొడుకు కార్తికేయ పుట్టాక వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. పిల్లాడి కోసం ఎంతో భరించినా చివరకు భర్త తనకు తెలియకుండా మరో మహిళతో ఉన్నాడు అని తెలిసాక 2015లో కౌసల్య విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న కౌసల్య గారికి కొడుకు మాత్రం రెండో పెళ్లి చేసుకో అంటూ సలహా ఇస్తాడట. నేను పెద్దవాడిని అయ్యాను నీ గురించి కూడా ఆలోచించు, పిల్లా నువ్వు పెళ్లి చేసుకో అని చెబుతుంటాడట.

అయితే తనకు నచ్చిన తన వ్యక్తిత్వానికి సరిపోయే వ్యక్తి కనిపిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ కౌసల్య తెలిపారు. రోజంతా బిజీగా ఉన్నా ఆరోజు ఏం జరిగింది ఎలా గడిచింది అంటూ చెప్పడానికి ఒక మనిషి కావాలనిపిస్తుంది. పెళ్లి అంటే ఒకరికి ఒకరు తోడుండటం కోసమే అంతే తప్ప ఇతర రీసన్స్ కోసం కాదు రెండో పెళ్లి తప్పు కాదు. ఎంతో మంది ఒంటరిగా ఉంటూ బాధపడుతున్నారు, వారి మనసులోని విషయాలను పంచుకోడానికి ఒక వ్యక్తి కావాలని భావిస్తారు. వయసుకు రెండో పెళ్లితో సంబంధం లేదు అంటూ ఆమె అభిప్రాయలను పంచుకున్నారు కౌసల్య.































