Singer Mangli: సింగర్ మంగ్లీ పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు తెలంగాణ యాసలో బతుకమ్మ పాటల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ప్రతి పండుగకు ప్రత్యేకమైన పాట పాడుతూ మంచి గుర్తింపు పొందారు. ఇలా ప్రవేట్ ఆల్బమ్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఎన్నో అద్భుతమైన పాటలను డాన్స్ వీడియోలను షేర్ చేసేవారు.

ఇలా సింగర్ మంగ్లీ పాటలకు మంచి ఆదరణ రావడంతో ఈమెకు సినిమాలలో పాటలు పాడే అవకాశం కూడా వచ్చింది. ఇలా ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో ఫేమస్ అయినటువంటి సింగర్ మంగ్లీ ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ భాషలో కూడా పాటలు పాడుతూ అక్కడ కూడా మంచి గుర్తింపు పొందారు.
ఈ విధంగా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా మంగ్లీ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ఒక్కో పాటకు కేవలం 20 నుంచి 30 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుని మంగ్లీ ప్రస్తుతం తన రెమ్యూనరేషన్ పదింతలు పెంచేశారు. ఈమె ఒక్క పాటకు ప్రస్తుతం రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Singer Mangli: లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మంగ్లీ…
ఇలా ఒక పాటకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే మంగ్లీ డిమాండ్ చేసిన విధంగానే నిర్మాతలు కూడా ఆమెకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈమె పాడే పాటలకు మంచి ఆదరణ రావడం చేత ఈమెకు బారి స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకాడటం లేదు.































