Singer Mangli: సింగర్ మంగ్లీ పరిచయం అవసరం లేని పేరు అద్భుతమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న మంగ్లీ తాజాగా బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆమెకు చేదు అనుభవం ఎదురైందని ఆమె కారుపై కన్నడిగులు రాళ్ల దాడి చేశారంటూ వార్తలు వచ్చాయి.

ఈ విధంగా మంగ్లీపై రాళ్లదాడి జరిగిందని తెలియడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ఈ ఘటనపై మంగ్లీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా మంగ్లీ గురించి ఇలాంటి వార్తలు వైరల్ కావడంతో ఈ వార్తలపై మంగ్లీ స్పందించి క్లారిటీ ఇచ్చారు. నాపై రాళ్ల దాడి జరిగిందని వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈమె క్లారిటీ ఇచ్చారు.
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నాపై దాడి జరిగిందని వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఇవన్నీ అసత్య ప్రచారాలే అంటూ కొట్టి పారేశారు. ఫోటోలు వీడియోల నుంచి మీరందరూ చూడగలిగే విధంగా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది. నేను పాల్గొన్న ఈవెంట్లలో ఉత్తమ ఈవెంట్ ఇది అని చెప్పాలి. కన్నడ ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతల గురించి మాటల్లో చెప్పలేను.

Singer Mangli: నా ప్రతిష్టను కించపరచడం కోసమే ఇలా…
ఈ వేడుకలో నాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అయితే కొందరు నా ప్రతిష్టను కించపరచడం కోసమే ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మంగ్లీ ఈ సందర్భంగా తన గురించి వస్తున్నటువంటి వార్తలను కొట్టి పారేశారు. ఇలా తనపై ఎలాంటి దాడి జరగలేదని ఈమె క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మంగ్లీ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






























