Singer Revanth : ఇండియన్ ఐడల్ గా గెలిచి సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమాలలో పాటలు పడుతూ అవార్డులను తెచ్చుకుంటూ సక్సెస్ ఫుల్ కెరీర్ లో ఉన్న రేవంత్ కి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న రేవంత్ తన లైఫ్ లో పడిన కష్టాల గురించి మొదటి సారి మిగిలిన కంటెస్టెంట్స్ తో షేర్ చేసుకున్నారు. రేవంత్ పుట్టింది శ్రీకాకుళం జిల్లా చదువుకున్నది విశాఖపట్నంలో. అయితే రేవంత్ ఇంకా పుట్టకనే తండ్రిని కోల్పోయాడు. తాను ఆరవ తరగతో చదివే వరకు తన తండ్రి లేడనే విషయం తనకు తెలియదట. తండ్రి గురించి అడిగితే అమెరికాలో ఉన్నాడు, వస్తాడు అంటూ తల్లి చెప్పేదట దీంతో ఎలా అయినా అమెరికా వెళ్లాలని అనుకునేవాడట.

చిన్న చిన్న పనులు చేస్తూ నేడు ఈ స్టేజి కి వచ్చిన రేవంత్…
ఇక తండ్రి చనిపోయినా తల్లి రేవంత్ ను అతని అన్నను చదివించారు. ఇక రేవంత్ మొదటి సారి స్టేజి మీద పాడినందుకు యాభై రూపాయలు ఇచ్చారట. ఇక పేపర్ బాయ్ గా పనిచేసిన రేవంత్ అవే కాకుండా, అంట్లు తోమడం, స్నేహితుల బట్టలు ఐరన్ చేసి పెట్టడం వంటివి చేస్తూ డబ్బు సంపాదించేవాడట. ఇక ఈ విషయాలను బిగ్ బాస్ లో టాస్క్ సందర్బంగా చెప్పి మొత్తం ఎపిసోడ్ ని ఎమోషనల్ గా మార్చేసాడు.

ఇక మొదటి సారి ఈటీవీ లో సంగీతం కార్యక్రమంలో పాల్గొని ఆ తరువాత మా టీవిలో సుపర్ సింగర్స్ లో పాల్గొన్న రేవంత్ ఇండియన్ ఐడల్ లో పాల్గొని విజేతగా నిలిచాడు. అందులో ఇరవై ఐదు లక్షల బహుమతి అలాగే కారు గెలుచుకున్నాడు. ఇక బాహుబలి లో పాడిన మనోహరి పాటతో అవార్డులను సైతం అందుకున్నాడు రేవంత్. ఒకప్పుడు చిన్నచిన్న పనులు చేస్తూ కష్టపడిన రేవంత్ ఇప్పుడు తెలుగు టాప్ సింగర్లలో ఒకడిగా ఉన్నాడు. అలాగే ఎంతో మంది యూత్ కి స్ఫూర్తిగా నిలిచాడు.


































