Singer Sunitha Son: ప్రముఖ గాయని సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందలకు పైగా పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు పొందిన సునీత ఇప్పటికీ తన గాత్రంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. తన మధురమైన స్వరంతో ఎన్నో సినిమాలలో పాటలు పాడిన సునీత సింగర్ గా మాత్రమే కాకుండా ఎంతోమంది హీరోయిన్లకు తన వాయిస్ ఓవర్ ఇచ్చి డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు పొందింది.

చాలా కాలం క్రితం భర్తకు దూరమైన సునీత తన ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఇటీవల పిల్లల సహకారంతో రెండవ వివాహం కూడా చేసుకుంది. ఇలా సునీత పర్సనల్ లైఫ్ ప్రస్తుతం చాలా సంతోషంగా సాగిపోతుంది. ఇదిలా ఉండగా సునీత కుమారుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సునీత కుమారుడు ఆకాశ్ గురించి నెటిజెన్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆకాష్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా తన లో ఉన్న సింగింగ్ డాన్సింగ్ టాలెంట్ తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇక ప్రస్తుతం “సర్కారు నౌకరి” సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
ఆర్కే టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ సినిమాకి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గురువారం రోజున పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడిగా భావనా వళపండల్ నటిస్తోంది.

Singer Sunitha Son: నిర్మాతగా వ్యవహరిస్తున్న రాఘవేంద్రరావు…
ఇక ఈ సినిమాలో తనికెళ్ళ భరణి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆకాష్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వటానికి సంవత్సరం పాటు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆకాశ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్స్‌ను చూపిస్తున్న ఆకాష్ త్వరలోనే వెండితెరపై తన యాక్టింగ్ టాలెంట్‌ను చూపించబోతున్నాడు. సునీత సింగర్ గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు పొందింది. అలాగే సునీత తనయుడు కూడా హీరోగా రానిస్తాడో? లేదో చూడాలి మరి.