బిగ్ బాస్ కార్యక్రమం మరొక మూడు రోజులలో ముగియడంతో ఈ కార్యక్రమం గురించి పలువురు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ గత ఎపిసోడ్ లో భాగంగా ఐదుగురు కంటెస్టెంట్ లకు పలు టాస్క్ లను ఇచ్చారు. మొదటి టాస్క్ బెలూన్ ఊది పగలగొట్టడంలో షన్ను గెలవగా, రెండవ టాస్క్ స్విమ్మింగ్ పూల్ లో దూకి టీ షర్టులు ధరించే టాస్క్ ఇచ్చారు. ఇందులో మానస్ గెలిచాడు.ఇక మూడవ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు అందరూ 13 క్షణాల పాటు లెక్కించాలని చెబుతూ బిగ్ బాస్ వారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ టాస్క్ లో భాగంగా షణ్ను, శ్రీరామ్, మానస్, సన్నీ, సిరి వరుసగా ఐదు స్థానాల్లోనిలవగా మొదటి స్థానంలో నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ బిర్యాని బహుమతిగా గెలుచుకోవడంతో అందరూ కలిసి తిన్నారు.

ఇక నాలుగవ టాస్క్ లో భాగంగా హౌ సభ్యులకు బిగ్ బాస్ కొన్ని శబ్దాలను వినిపించి జంతువుల పేర్లు రాయమని చెప్పారు. ఇందులో సిరి తప్పు సమాధానం రాయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇక ఐదవ టాస్క్ లో భాగంగా ఎక్కువ సేపు తాళ్ళు ఊపే టాస్క్ ఇవ్వగా ఇందులో సన్నీ,సిరి,షణ్ముఖ్ ఆడగా సన్నీ గెలిచాడు.
సరదాగా సన్నీ ఓడిపోయారు కదా మరొకసారి ఆడదామా అంటూ తమాషాగా అనడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అతనితో గొడవకు దిగింది.ఇక తన సరదాగా అన్నాను అని చెప్పే ప్రయత్నం చేసిన సిరి మాత్రం ఓడిపోయావు అన్నావు నాకు నచ్చలేదు అది సరదాగా అంటారా అంటూ తనపై గట్టి గట్టిగా అరిచింది. ఇక సహనం కోల్పోయిన సన్నీ చివరికి తనని ఇమిటేట్ చేశాడు.
పక్కనోడు గెలిస్తే సహించలేడు అంటూ గట్టిగా అరవడం కాకుండా నాతో జోకులు వద్దు అంటూ సన్నీకి వార్నింగ్ ఇస్తూ నువ్వు ఏమైనా హీరో అనుకుంటున్నావా అంటూ అతని పై పెద్ద ఎత్తున గొడవకు దిగింది. ఇక దీంతో తినడానికి రమ్మన్న సిరి అలిగి కూర్చుంది. తరువాత మానస్, సన్నీ మాట్లాడుతూ ఎప్పుడు ఏ గొడవ అయినా నేనే వెళ్తాను ఇంత ఓవర్ యాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? నన్ను వెళ్లే ముందు ఇలా బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏం వస్తది? నేనేమైనా హీరోనా అంటుంది నా దునియాకు నేను హీరో నన్ను అభిమానించే వాళ్లకు నేను హీరో అంటూ సన్నీ మానస్ దగ్గర చెప్పుకొచ్చాడు.
































