బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ముగిసింది. బిగ్ బాస్ 5వ సీజన్ విన్నర్ గా సన్నీ నిలిచాడు. రన్నరప్ గా షణ్ముఖ్ నిలిచాడు. అయితే ఫైనల్ వరకు టాప్ 5 లో కొనసాగిన సిరి.. ఫైనల్ లో ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మొదటిసారిగా టాప్5లో సిరి చోటు సంపాదించి రికార్డ్ సృష్టించింది.

ముఖ్యంగా షన్నూ, సిరిల మధ్య రొమాంటిక్ హగ్గింగులు, కెమిస్ట్రీ ఈ సీజన్ కే హైలెట్ గా నిలిచాయి. అయితే గతంలో ఈ కౌగిలింతలపై సిరి తల్లి సిరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ లో హౌజ్ లోకి వచ్చిన సిరి తల్లి శ్రీదేవి.. సిరి హగ్గింగులు ఇవ్వడం నచ్చలేని చెప్పింది.
అప్పట్లో ఈ మాటలు చాలా వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం సిరి తల్లి నేను ఇలా అనాల్సింది కాదని అంది. హగ్గింగులు నచ్చట్లేదని మాట్లాడాల్సింది కాదని అంటూ బాధపడింది. అయితే సిరి మాత్రం.. మాది మధ్యతరగతి కుటుంబం.. అనేక మంది బంధువులు ఉంటారు. దీంతో బహుషా మా అమ్మ అలా అని ఉంటుందని చెప్పుకొచ్చింది.
షన్నూకు దగ్గరయి పోతున్నావంటూ.. సిరి తల్లి హగ్గింగులు నచ్చలేదని కామెంట్లు చేసిన క్రమంలో.. అవి మా అమ్మ మనసు నుంచి వచ్చిన మాటలు కాదని సిరి అన్నారు. అయితే ఈ కామెంట్లు చేసిన తర్వాత చాలా మంది నన్ను విమర్శించారని చెప్పుకొచ్చింది. అయితే తల్లిగా నీకు అనిపించింది చెప్పడంలో తప్పు లేదని నాగార్జున సపోర్ట్ చేశారు.




























