షణ్ముఖ్ ను హగ్ చేసుకోవడం నచ్చలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సిరి తల్లి!

0
72

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎంతో సందడి నెలకొంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కంటే స్టేట్లో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ క్రమంలోనే ఆనందంతో కొందరు కంటెస్టెంట్ లో ఎమోషనల్ అవుతున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి సిరి మదర్ ఎంట్రీ ఇచ్చారు.

ఈమె హౌస్ లోకి రాగానే తన కూతురిని హత్తుకొని ఎమోషనల్ అయ్యింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి తల్లి తన కూతురికి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సందర్భంగా సిరి మదర్ మాట్లాడుతూ తాను ఎంతో అద్భుతంగా ఆడుతోందని, ఇలాగే ఆడితే తప్పకుండా తన కూతురు గెలుస్తుందని తెలిపింది.

తను హౌస్ లో ఎంతో అద్భుతంగా ఆట ఆడుతున్న ప్పటికీ షణ్ముఖ్ తో కలిసి హగ్ చేసుకోవడం అతనితో చనువుగా ఉండటం తనకు నచ్చలేదని మొహం మీదే చెప్పేసింది. ఒక్కసారిగా సిరి మదర్ షణ్ముఖ గురించి ఈ విధమైనటువంటి కామెంట్ చేయడంతో షణ్ముఖ్ తో సహా అందరూ షాకయ్యారు.

షణ్ముఖ్ తనకు ఎంతో హెల్ప్ చేస్తున్నాడని తనని ఎంతో ప్రోత్సహిస్తున్నారని ఒక అన్నగా, ఫ్రెండ్ గా తన బాధ్యతలు నెరవేరుస్తున్నారని చెప్పుకొచ్చిన ఈమె తనని హాగ్ చేసుకోవడం మాత్రం నచ్చలేదంటూ ఖరా ఖండిగా చెప్పేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో శ్రీ రామచంద్ర సోదరి, కాజల్ భర్త, కూతురు, మానస్ మదర్ కూడా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here