తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కి తీవ్ర అస్వస్థతకు చేయడంతో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో గత రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.రెండు రోజుల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నఫలంగా అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు కిమ్స్ కి తరలించారు.

ప్రస్తుతం ఆయనకు కిమ్స్ వైద్యులు వైద్యం అందిస్తున్నారు.అయితే అతని ఉన్నఫలంగా ఎందుకు అనారోగ్యం చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏవిధంగా ఉందనే విషయం తెలియాల్సి ఉంది.ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలు రాసి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉన్నపళంగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే అతనికి ఏం జరిగింది.. అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన అభిమానులు అతను తొందరగా కోలుకుని తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అయితే పూర్తి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.































