పాటల పూదోటగా విరిసిని కుసుమం సీతారామ శాస్త్రి.. ఎందరో మహానుభావువులు.. అందరికీ అవందనాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి వేల వేల వందనాలు.. సినిమా ఉన్నంత వరకు సీతారామ శాస్త్రి పాట బతికే ఉంటుంది. ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు.. కానీ.. ఆయన పాటలు.. మాధుర్యం అందరి గుండెల్లో బతికే ఉంది. మనసును హత్తుకునే పాటలెన్నో రాశాడు.. మనిషిని కదిలించే పాటలెన్నో రాశారు. అక్షరాలనే ఆయుధాలుగా మార్చేసి, పాటలో పదాలను నిక్షిప్తం చేసి సమాజాన్ని నిగ్గదీసి అడిగాడు. అతడి సాహిత్యం ఆయన పాటలో ప్రవహిస్తుంది. అతడి మృతి పట్ల ‘తెలుగు డెస్క్’ నివాళి అర్పిస్తోంది.

అతడికి అవకాశాలు ఎలా వచ్చాయి.. వాటి గురించి తెలుసుకుందాం.. 1986లో మొదటి సారిగా అవకాశం వచ్చింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో అందులో అన్ని పాటలు అతడే రాశాడు. అతడి పాటకలు కె.మహదేవన్ సంగీతాన్ని అందించాడు. అందులో ముఖ్యంగా పాపులారిటీ సాధించిన పాట ‘విధాత తలపున ప్రభవించినది’. ఇప్పటికీ ఈ పాట వింటుంటే.. మనస్సులో ఉన్న బాధ అంతా పోయి.. ఎంతో ఉల్లాసంగా ఉంటారు. మొత్తం ఈ సినిమాలో 9 పాటలు రాశాడు. ఈ సినిమా తర్వాత సిరివెన్నెలకు అవకాశాల కొకొల్లలుగా వచ్చాయి.
అందే సంవత్సరంలో వంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్. దీనిలో అతడు గోపీలోలా, ఎక్కడ ఎక్కడ అనే పాటలు రాశాడు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత శ్రుతిలయలు, స్వయంకృషి వంటి సినిమాలకు పాటలు రాసేందుకు మళ్లీ కె. విశ్వనాథ్ అతడికి అవకాశం కల్పించారు. 1988లో వచ్చిన రుద్రవీణ సినిమాకు ఆరు పాటలు అతడే రాశాడు. అతడు ప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘గాయం’ తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని… అనే పాట పాడి ముఖ్యమైన పాత్రలో అతడు నటించాడు.
తాను రాసిన పాటకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. 2020లో విడుదలైన ‘అల వైకుంఠపురం’ సినిమాలో థమన్ సంగీత దర్శకుడిగా ‘సామజవరగమన’ పాటకు పెద్ద ఆదరణ లభించింది. మళ్లీ సిరివెన్నెల ఈజ్ బ్యాక్ అన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. 1986 నుంచి మొదలైన అతడి ప్రస్థానం 2021 వరకు సాగింది. తాజాగా అతడు ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాటకు లిరిక్స్ అందించాడు. అతను 2020 వరకు 3000 పాటలకు సాహిత్యాన్ని రచించాడు. 2019లో, కళలు మరియు సౌందర్య రంగానికి చేసిన కృషికి గాను అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది .































