AP Politics: ఏపీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో చోటు చేసుకున్నటువంటి గొడవలు అల్లర్లకు గల కారణాలు ఏంటి అనే విషయంపై ఈసీ కీలక ఆదేశాలు జారీచేసింది. ఏపీలోని పల్నాడు అనంతపురం వంటి జిల్లాలలో పెద్ద ఎత్తున గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ గొడవలకు కారణం ఏంటి అనే విషయంపై సిట్ విచారణ జరపాలని ఈసీ సంచలనమైన ఆదేశాలను జారీచేశారు.

ఇప్పటికే ఏపీలో ఎక్కడైతే గొడవలు చోటుచేసుకున్నాయో ఆ ప్రాంతంలో సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే తాజాగా ప్రాథమిక నివేదికను ఈసీకి అందజేసినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో విచారణపై సిద్ధం చేసిన సిట్ ప్రాథమిక నివేదికను ఇవాళ డీజీపీకి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ అందించనున్నారు.
సీఎస్ ద్వారా సీఈవో, సీఈసీకి ప్రాథమిక నివేదికను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పూర్తి స్థాయిలో విచారణ జరపడం కోసం సిట్ మరి కొన్ని రోజులు గడువు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. పల్నాడు చిత్తూరు అనంతపురం జిల్లాలలో గొడవలకు కారణమైన ప్రాంతంలో అధికారులు భారీ స్థాయిలో విచారణ చేపట్టారు.
పోలీసుల వైఫల్యమే..
ఈ విచారణలో భాగంగా పోలీసుల వైఫల్యం గొడవలు అల్లర్లకు కారణమని ప్రాథమిక నివేదికలు వెళ్లడైనట్లు తెలుస్తుంది. పోలీసులు ఎన్నికల విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలం అయినటువంటి తరుణంలోని ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని సిట్ అధికారులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు.





























