Sitara: ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ తండ్రితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ వారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార సైతం తన తండ్రితో చాలా అల్లరి చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇలా మహేష్ బాబు తో చాలా సరదాగా అల్లరి చేస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈమె తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోని షేర్ చేసిన సితార నా సూపర్ డాడ్ నా చీర్ లీడర్ అంటూ మా నాన్నకి ఫాథర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పోస్ట్ పెట్టింది.
ఈ పిక్స్ లో మహేష్ సితారలు తమ హ్యాపీ మూమెంట్స్ ని గడుపుతూ ఉండగా ఈ పిక్స్ చూసిన అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుత ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Sitara: గుంటూరు కారం…
ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇందులో మహేష్ బాబుకి జోడిగా పూజ హెగ్డే శ్రీ లీలా నటిస్తున్నారు.ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన తదుపరిచిత్రాన్ని దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు.ఈ సినిమా కూడా ఈ ఏడాది ఆగస్టు నెలలో పూజా కార్యక్రమాలను ప్రారంభించుకోబోతోంది.



























