Sitara Ghattamaneni: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సెలబ్రిటీ పిల్లల్లో సితార ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిట్టి పాపకు సోషల్ మీడియాలో హీరోయిన్స్ లో అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా మామూలుగా సెలబ్రిటీ పిల్లలు అంటే కాస్త స్టైలిష్ గా మోడల్ గా ఉంటారు. కానీ సితార మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. అంతేకాకుండా పండుగ సమయాలలో లంగా ఓణి వంటివి ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

అలా ఈమె చిన్న వయసులోనే తన మంచి మనసుతో ఎంతోమందికి సహాయం చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. మొన్నటికి మొన్న ఒక జ్యువెలరీ యాడ్స్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ యాడ్ కాను సితార దాదాపుగా కోటి రూపాయల వరకు పారితోషికాన్ని అందుకుంది. ఇకపోతే ఇటీవల కాలంలో సితారకు సంబంధించిన ఏదో ఒక విషయం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా సితార తరచూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. అలా చిన్న ఏజ్ లోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. తండ్రి మహేష్ బాబు బాటలోనే నడుస్తూ కొన్ని మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది సితార.
లక్షల్లో సంపాదన..
చదువుతో పాటు మరో పక్క మన కల్చరల్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటూ ఉంటుంది. ఈమె సింప్లిసిటీకి ప్రతి ఒక్కరూ కూడా ఫిదా అవ్వాల్సిందే. కాగా సితార యూట్యూబ్ ఛానల్ ద్వారా తన డాన్స్ వీడియోలతో పాటు తనకు సంబంధించిన అన్ని వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక కేవలం యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక యూట్యూబ్ లో, ఇంస్టాగ్రామ్ లో సితార ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగానే ఉందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా సితార తన ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సితార నెల సంపాదన గురించి ఒక వార్త వైరల్ గా మారింది. సితార ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు సుమారుగా 30 లక్షల వరకు సంపాదిస్తోందట. ఈ వార్త వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏంటి ఇంత చిన్న వయసులో కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారా అన్ని లక్షలు సంపాదిస్తుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


































