Shivaji: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు శివాజీ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు. గతంలో హీరోగా 70 సినిమాలలో నటించిన ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 26 సినిమాలలో నటించారు. క్రమక్రమంగా శివాజీకి అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు కానీ బిగ్ బాస్ ద్వారా మరోసారి ఫామ్ లోకి వచ్చారు..

ఇటీవల 90స్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన సినిమాల గురించి మాట్లాడుతూ.. ఇక ఈ ఏడాదితో తన వంద సినిమాలు పూర్తి అవుతాయని తెలిపారు. మొదట నాకు మాస్టర్ సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు. నేను పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నటువంటి చిరంజీవి గారు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారని ఆ డబ్బుతో నేను ఆరు నెలలు గడిపానని తెలిపారు.
ఇక ఇండస్ట్రీలో ఈయన నటించిన పలు సినిమాల గురించి కూడా మాట్లాడారు. అలీ గారి సహాయంతోనే నేను ఇల్లు కట్టుకొని 30 ఎకరాల పొలం కొన్నానని ఈయన అప్పటి విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక రాజకీయాల గురించి కూడా వీరిద్దరి మధ్య ప్రస్తావన వచ్చింది. గతంలో శివాజీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆలీ వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.
ప్రకృతి వనరులు దోచుకోవాలి..
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ అన్న మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను మీరు ఏ పార్టీలో అయినా ఉండండి కానీ ఎన్నికలలో మాత్రం పోటీ చేయొద్దు అంటూ తెలియజేశారు. ఎన్నికలలో పోటీ చేయడం కోసం మనం ఖర్చు పెట్టినటువంటి డబ్బు రావాలంటే ప్రకృతి వనరులను దోచుకోవాలంటూ ఈ సందర్భంగా ఆలీకి ఈయన సూచనలు చేశారు. మరి శివాజీ సూచనలను అలీ పాటిస్తారా లేకుంటే ఎన్నికలలో నిలబడతారా అనేది తెలియాల్సి ఉంది.































