SJ Surya: సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఎస్ జె సూర్య ఒకరు. ఈయన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక దర్శకుడిగా కూడా ఎస్ జె సూర్య ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఇక ఈయన శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా భారతీయుడు 2 సినిమా జూలై 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఇటీవల హైదరాబాద్ లో ఈ సినిమా వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో భాగంగా డైరెక్టర్ శేఖర్ తో పాటు కమల్ హాసన్, సిద్ధార్థ, ఎస్ జె సూర్య వంటి వారందరూ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ జె సూర్య మాట్లాడుతూ నేను గతంలో పవన్ గురించి ఎన్నో విషయాలు చెప్పాను. పవన్ ఎప్పటికైనా రాజకీయాలలో ఎదుగుతారని మంచి సక్సెస్ అందుకుంటారని తెలిపాను.
సీఎం అవుతాడు..
గతంలో నేను చెప్పిన విధంగానే ఇప్పుడు నా మిత్రుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని త్వరలోనే నా మిత్రుడు ఏపీ సీఎం అనే వార్తను కూడా నేను వింటానని తనని సీఎంని చేసే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది అంటూ అభిమానులను ఉద్దేశించి ఈయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.



























