Vijay Thalapathy: తమిళ సీనియర్ నటుడు డిఎండీకే పార్టీ నేత విజయ్ కాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడితే గురువారం ఉదయం మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం కన్నుమూయడంతో కోలీవుడ్ చిత్రం పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి కెప్టెన్ విజయ్ కాంత్ కు నివాళులు అర్పించారు.

ఇలా విజయ్ కాంత్ కి నివాళులు అర్పించడం కోసం హీరో విజయ్ దళపతి కూడా వచ్చారు. డి ఎం డి కె పార్టీ కార్యాలయంలో ఆయన పార్థివ దేహం ఉంచగా అక్కడకు ఈయన వచ్చి నివాళులు అర్పించడమే కాకుండా కెప్టెన్ భార్య ప్రేమలతతో విజయ్ మాట్లాడి ఆమెను ఓదార్చి తిరిగి వెళ్లిపోయారు ఈ సమయంలోనే అభిమానులు పెద్ద ఎత్తున గుంపుగా చేరడంతో తోపులాట జరిగింది.
ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి హీరో విజయ్ పై చెప్పు విసిరారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనపై చెప్పు విసిరినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి కారులో కూర్చున్నారు అయితే తమ అభిమాన హీరో పట్ల చెప్పు దాడి జరిగిందనే విషయం తెలిసి విజయ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఈ పని అజిత్ ఫాన్స్ చేసి ఉంటారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
కెప్టెన్ సాక్షిగా..
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో విజయ్ అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వివాదం నడుస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇక ఇద్దరు హీరోల సినిమాలు కనుక విడుదలైతే వీరి అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ క్రమంలోనే విజయ్ పై వారి దాడి చేశారు అంటూ అభిమానులు భావిస్తున్నారు కానీ అజిత్ మాత్రం విజయ్ పట్ల జరిగినటువంటి ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.






























