కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న అతి ముఖ్యమైన స్కీమ్ లలో వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ కూడా ఒకటి. కేంద్రం ఈ స్కీమ్ ద్వారా దేశంలో రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ స్కీమ్ వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లకు, కొత్త ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డ వాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది.

దేశంలో దాదాపు 80 కోట్ల మంది వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ ద్వారా రేషన్ ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే మోదీ సర్కార్ రేషన్ కార్డులలో మార్పులు చేయడానికి, ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించడానికి సిద్ధమవుతోంది. భవిష్యత్తులో రేషన్ కార్డులను ఏటీఎం కార్డు తరహాలో ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ తరహా రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైంది.

మంచి క్వాలిటీతో జేబులో సులభంగా పెట్టుకునే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఉండటం గమనార్హం. దేశంలోని 28 రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం వన్ రేషన్ వన్ నేషన్ స్కీమ్ ను అమలు చేస్తోంది. జేబులో సులభంగా పెట్టుకునేలా ఈ కార్డు ఉండటంతో ఒకచోటు నుంచి మరోచోటుకు సులభంగా తీసుకెళ్లవచ్చు. వలస కూలీలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

కరోనా, లాక్ డౌన్ సమయంలో దేశంలో వలస కూలీలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అందువల్ల వలస కార్మికులకు ప్రయోజనం చేకూరే విధంగా మోదీ సర్కార్ కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా అర్హులై రేషన్ కార్డు పొందలేకపోతే వాళ్లకు సులభంగా రేషన్ కార్డును పొందే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here