Smitha: ప్రస్తుతం టాక్ షోలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఇదివరకు బుల్లితెరపై ఎన్నో రకాల టాక్ షోలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ టాక్ షోలు ఓటీటీలో కూడా ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో అందరిని సందడి చేయగా తాజాగా మరొక కార్యక్రమం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయింది.

అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించగా… నిజం విత్ స్మిత అనే టాక్ షో కి స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షో ఫిబ్రవరి 10 నుంచి సోనీ లీవ్ లో ప్రసారం కానుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి చిరంజీవి, రాధిక, రానా, నాని అడివి శేష్, సాయి పల్లవి వంటి సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరైనట్టు తెలుస్తుంది.

Smitha: వెన్నుపోటు గురించి ప్రశ్నించిన స్మిత…
ఈ ప్రోమోలో భాగంగా చిరంజీవి సినిమాల గురించి మాట్లాడగా నాని నెపోటిజం గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక స్మిత చంద్రబాబు నాయుడుని ఏకంగా వెన్నుపోటు గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్న అడగగానే చంద్రబాబు నాయుడు ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కి కూడా భాగం ఉంది అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. అయితే వెన్నుపోటుకు సంబంధించిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి సమాధానం చెప్పారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




























