ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని మనం పలు సార్లు విని చూసి ఉంటాము.అయితే ఈ విషయాన్ని చూసి చూడనట్టు, విని విననట్టు వ్యవహరిస్తాము. ఫలితంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం ధూమపానం చేసే వారు మాత్రమే కాకుండా వారి పక్కన ఉన్న వారికి కూడా అనేక సమస్యలకు కారణమవుతోంది.

ముఖ్యంగా అబ్బాయిలు అధికంగా ధూమపానం చేయడం వల్ల వారికి పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేసే వారిలో సెమెన్ క్వాలిటీ తగ్గిపోతుంది. అదే విధంగా స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా వీరికి పిల్లలు పుట్టే అవకాశాలు 50% తగ్గిపోతాయి. మీకు పిల్లలు కావాలని భావిస్తే వెంటనే ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఎవరైతే పిల్లలు కావాలని భావిస్తారు అలాంటి పురుషులు, స్త్రీలు వీరిలో ఎవరికైనా ధూమపానం అలవాటు ఉంటే వెంటనే ఆ అలవాటును మానుకోవాలి. ధూమపానం చేయకపోయినా, ఆ వాసనను పీల్చడంవల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదని అందుకోసమే పురుషులు వీలైనంతవరకు ఈ అలవాటుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు ఆమె ధూమపానం చేయడం లేదా కుటుంబంలో ఎవరైనా కూడా ధూమపానం చేసిన ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై అధికంగా చూపెడుతుంది.గ్రోత్ రెస్ట్రిక్షన్స్ మరియు మాటర్నల్ హై బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలువస్తాయి కనుక వీలైనంత వరకు ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల కేవలం ఈ సమస్య మాత్రమే కాకుండా ఎన్నో రకాల క్యాన్సర్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.































