Sneha: సినీ నటి స్నేహ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా ఈమె సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ పొందారు. అయితే ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగి లేకపోయినా స్నేహ ప్రస్తుతం మాత్రం కార్యక్రమా ఎన్నో సినిమాలలో అక్క వదిన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే స్నేహ సినీ నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరి వివాహం తర్వాత ఇద్దరు పిల్లలతో ఎంత సంతోషంగా గడుపుతున్నారు. అయితే తరచూ ఈమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇలా స్నేహం విడాకులు తీసుకొని విడిపోతున్నారని వార్తలు వచ్చిన తరుణంలో తన భర్త ప్రసన్న ఈ విడాకుల వార్తలను పూర్తిగా ఖండించారు.
స్నేహ ప్రసన్న కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఈ విడాకుల వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు. అయితే తాజాగా స్నేహ ప్రసన్న ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఇటీవల స్నేహాలయం అనే ఒక వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు తీసుకుంటున్నటువంటి విడాకులు గురించి వీరికి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Sneha: వారి వ్యక్తిగతం…
సెలబ్రిటీలు ఎక్కువగా విడాకులు తీసుకొని విడిపోతున్నటువంటి తరుణంలో స్నేహ దంపతులకు ఈ ప్రశ్న ఎదురు కావడంతో ఈమె విడాకులు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.విడాకులు అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది మనం చెప్పలేము. అది తెలియనప్పుడు.. వాటి గురించి, వారి గురించి స్పందించే అధికారం మాకు లేదు అంటూ ఈమె తెలియచేసారు.



























