Sneha Paul: సినిమా పరిశ్రమలో కొంతమందికి వెంటనే అవకాశాలు దొరుకుతాయి.. మరికొంత మందికి ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అయితే అవకాశాలు రాగానే సరిపోదు.. వాటిని ముందుకు తీసుకెళ్లాలంటే అదృష్టంతో పాటు.. వాళ్లు నటించే సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి.

అయితే ఇక్కడ చెప్పే ఓ నటికి కూడా సేమ్ అలానే జరిగింది. ఆమె పేరు స్నేహ పాల్. ఈమె కోల్ కత్తాకు చెందిన ఒక మోడల్. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఎక్కువగా చదువు కంటే కూడా.. ఆటపాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది. డ్యాన్స్ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఫేవరేట్ అలవాటు కూడా ఢ్యాన్సే. అందుకే ఆమె శాస్త్రీయ నాట్యంలో కూడా శిక్షణ తీసుకుంది.

ఈ డ్యాన్సే ఆమెను సినిమాల వైపు నడిపించింది. అయితే మొదటగా కన్నడంతో అవకాశం వచ్చింది. కన్నడలో మొదటిసారి ‘డ్రీమ్‌గర్ల్’ అనే సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది. అయితే ఆమెకు అది పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. దీంతో అవకాశాలు రాకుండా పోయాయి. ఇక ఆమె కొన్ని సంవత్సరాలు విరామం తీసుకుంది.
ఆ వెబ్ సిరీస్ పేరు ‘ది సిటీ అండ్ ఏ గర్ల్’..
ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఓ చుట్టు చుట్టేసే కార్యక్రమం పెట్టుకుంది. ఇదే ఆమెకు వరంలా మారింది. ఆమెను ముంబయ్ లో ఓ టెక్నీషియన్ సంప్రదించడంతో ఆమె మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వెబ్ సిరీస్ లో అవకాశం కల్పించాడు. ఆ వెబ్ సిరీస్ పేరు ‘ది సిటీ అండ్ ఏ గర్ల్’. ఇక వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందంటే ఆమె కెరీర్ కు ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది. దీంతో పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. యూట్యూబ్ ఛానల్, షార్ట్ ఫిల్మ్స్ లు చేస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆమె ‘చర్మ్‌సుఖ్ చాల్ హౌస్’ సిరీస్ లో నటించారు. ఇక కెరీర్ మొదట్లో బోల్డ్ గా కనిపిస్తే.. కెరీర్ మొత్తం బోల్డ్ గా కనిపించే పాత్రలే వస్తాయని చాలామంది అంటారు కానీ.. ఏ పాత్ర అయినా చేసే విధంగా సిద్ధంగా ఉండాలని ఆమె చెబుతున్నారు.
































