Sneha Ullal: నటి స్నేహ ఉల్లాల్ అచ్చం ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉంటూ జూనియర్ ఐశ్వర్యరాయ్ గా పేరు సంపాదించుకున్న ఈమెను బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అనంతరం ఈమె తెలుగులోకి నాగార్జున నటించిన కింగ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఓ మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

అలాగే కరెంట్ సినిమాలో కూడా ఈమె నటించే సందడి చేశారు. ఇలా పలు సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు అనంతరం అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. కొద్దిరోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి స్నేహ ఉల్లాల్ తిరిగి వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. ఇలా వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది.
ఇకపోతే ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో ఒక టాలీవుడ్ యంగ్ హీరో కోసం పెద్దగా పార్టీ ఇచ్చారని సమాచారం. ఇలా ఆ హీరో పుట్టినరోజు సందర్భంగా ఏకంగా పబ్ లో తనకు పుట్టినరోజు వేడుకలను అరేంజ్ చేసి స్నేహితులను ఆహ్వానించారు. ఈ విధంగా ఆ హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన అనంతరం ఆ వేడుకకు ఆ హీరో రాకపోవడంతో కాస్త నిరుత్సాహపడ్డారట.

Sneha Ullal: నిరుత్సాహపరిచిన రీ ఎంట్రీ….
ఇలా పుట్టినరోజు వేడుకలకు ఆ హీరో రాకపోయినప్పటికీ ఈమె ఏమాత్రం కాస్త నిరుత్సాహానికి గురై తన స్నేహితులతో కలిసి ఏకంగా మందుకొడుతూ పెద్ద ఎత్తున రచ్చ చేశారని వార్తలు షికార్లు చేశాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బీర్లు కొట్టి పబ్బులో పెద్ద ఎత్తున సందడి చేయడమే కాకుండా రోడ్లపై కూడా చిందులు వేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ టాలీవుడ్ హీరో మరెవరో కాదు మంచు మనోజ్. మంచు మనోజ్ తో తనకున్న మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ తోనే తన బర్త్డే పార్టీని అరేంజ్ చేసిందని గతంలో వార్తలు వచ్చాయి.































