sobhita: సినీనటి శోభిత నాగచైతన్య వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికీ వేరే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి .ఇటీవల హల్దీ వేడుకను మంగళ స్నానాలను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే శోభిత నాగచైతన్య వివాహ వేడుకలలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుగుతోంది..

శోభిత కుటుంబ సభ్యులు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు కావడంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చాలా సాంప్రదాయపద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలను శోభిత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈమె పెళ్లికూతురులా ముస్తాబై ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి.
ఎరుపు రంగు చీర కట్టుకొని కళ్యాణ తిలకం నుదుటన పెట్టి ఒంటినిండా నగలతో సాంప్రదాయం ఉట్టిపడేలా శోభిత ముస్తాబై ఉన్నారు. ఇలా ఈ ఫోటోలను శోభిత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో శోభిత చెల్లి సమంత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

sobhita: బ్రాహ్మణ సంప్రదాయం..
ఇక నాగచైతన్య శోభిత వివాహం డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయ ఆచారాల ప్రకారం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లి వేడుకలలో అత్యంత సన్నిహితులు ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు అలాగే స్నేహితులు మాత్రమే పాల్గొనబోతున్నారని వీరి వివాహం చాలా సింపుల్గా చేస్తున్నట్టు నాగార్జున ఇది వరకు తెలిపారు.

































