Sobhita: మరి కొన్ని గంటలలో శోభిత నాగచైతన్యల వివాహం జరగబోతుంది. ఈ క్రమంలోనే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. అలాగే వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు మూడుముళ్ల బంధంతో నాగచైతన్య శోభిత ఒకటి కాబోతున్నారు. ఈ తరుణంలోని వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే శోభితకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈమె అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే సమయానికి అక్కినేని ఇంట్లో ఉన్నటువంటి నాగేశ్వరరావు ఫోటోని తీసేయాలని కండిషన్ పెట్టారట. ఇలా నాగేశ్వరరావు ఫోటోని తీసేయమని కండిషన్ పెట్టడం ఏంటి అనే విషయానికి వస్తే .. అక్కినేని నాగేశ్వరరావు గారు చివరిగా నటించిన మనం సినిమాలోని ఒక ఫోటోని నాగేశ్వరరావు ఇంటి ఎంట్రన్స్ లోనే పెద్దగా పెట్టించారట.
ఇక ఈ ఫోటోలో నాగేశ్వరరావుతో పాటు మనం సినిమాలో నటించిన వారందరూ కూడా ఉన్నారు. అందులో నాగార్జున నాగచైతన్య సమంత కూడా ఉండటం విశేషం. ఈ ఫోటో నాగేశ్వరరావుకి ఎంతో ఇష్టమైనది. అయితే ఈ ఫోటోలో సమంత ఉండటంతో ఈ ఫోటోని తీసేయాలని శోభిత చెప్పారట. ఇక నాగార్జునకు ఈ ఫోటో తీసేయడం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితులలో అందుకు ఒప్పుకున్నారని తెలుస్తుంది.

Sobhita: సమంత ఉండటం..
ఇక ఈ ఫోటో తీసేయకపోతే తిరిగి నాగ చైతన్య శోభిత మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే నాగార్జునకు ఇష్టం లేకపోయిన శోభిత చెప్పిన విధంగానే ఈ ఫోటోని తీసేయడానికి నాగార్జున ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
































