Sobhita: నాగచైతన్యతో డేటింగ్ రూమర్లపై స్పందించిన శోభిత… స్పందించాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్!

0
40

Sobhita: నాగచైతన్య శోభిత గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న పేర్లలో ఒకటి. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి శోభితతో రిలేషన్ లో ఉన్నారంటూ తరచు వీరి గురించి ఎన్నో వార్తలు వినపడుతున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ లండన్ లోని ఓ రెస్టారెంట్లో కనిపించడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి.

ఇలా తరచు నాగచైతన్య శోభిత గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు శోభిత ఈ వార్తలపై స్పందించలేదు. అయితే తాజాగా శోభిత తన గురించి వస్తున్నటువంటి రూమర్స్ పై స్పందిస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తను తాజాగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చానని తెలిపారు.

ఏఆర్ రెహమాన్ గారి సంగీత సారథ్యంలో అద్భుతమైన డాన్స్ చేయడం ఎంతో మంచి అనుభూతిని కలిగించింది ఇలాంటి మంచి జ్ఞాపకాలు ఉన్నప్పుడు నాకు సంబంధం లేనటువంటి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు.ఎవరో ఏదో అన్నారని ఓ పట్టించుకోని వాటి గురించి ఫీల్ అవ్వాల్సిన పనిలేదు మనకు సంబంధం లేని విషయంలో మనం స్పందించాల్సిన అవసరం ఏమాత్రం లేదని తెలిపారు.


Sobhita: తప్పు లేనప్పుడు కంగారు పడాల్సిన పనిలేదు…

ఇందులో నా తప్పు లేనప్పుడు నేను అంత అర్జెంటుగా స్పందించాల్సిన అవసరం ఏముంది.. నేను ఏ తప్పు చేయనప్పుడు కంగారు పడాల్సిన పనిలేదనినా పని నేను చేసుకుంటూ పోతున్నాను అంటూ ఈ సందర్భంగా రూమర్స్ పై స్పందిస్తూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా శోభిత నాగచైతన్య డేటింగ్ రూమర్స్ ఆగుతాయా లేదా అనే విషయం.