Social Activist Krishna Kumari : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఇప్పటికీ హరిహర కృష్ణ లొంగిపోగా తాజాగా హరి హరి స్నేహితుడు హాసన్ అలాగే ప్రియురాలు నిహారికను పోలీసులు అరెస్ట్ చేసారు. హరిహర మాత్రమే హత్య చేయగా విషయం తెలిసిన వాళ్ళలో నిహారిక, హాసన్ అలాగే హరిహర తండ్రి ఉన్నారు. అయితే నిహారిక, హాసన్ ఇద్దరు విషయం తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అయితే తమకేమి తెలియదు అంటూ ఇంతవరకు బుకాయించిన వీళ్లిద్దరు దొరికిపోయారు. ఏకంగా హత్య జరిగిన చోటుకు వెళ్లి మరీ చూసి అక్కడి నుండి రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీ తిన్నారు ముగ్గురు. ఈ విషయాలన్నీ బయట పడటంతో ఇప్పుడు నిహారిక రెడ్డి అలాగె హాసన్ కి కూడా ఈ కేసులో శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధిచిన విషయాలను సామాజిక వేత్త కృష్ణ కుమారిగారు చర్చించారు.

ఇదంతా నిహారిక రెడ్డి స్కెచ్….
కృష్ణ కుమారిగారు ఈ కేసు గురించి మాట్లాడుతూ హరిహర హత్య చేయడానికి ప్రేరేపించింది నిహారికనే అంటూ చెప్పారు. నిహారిక ,నవీన్ గతంలో ప్రేమించుకున్నారు. అయితే నవీన్ ఆమెను కుటుంబం బాధ్యతల నేపథ్యంలో దూరం పెట్టడం వల్ల ఆమె భరించలేక పోయింది. కాదంటే నేను కాదనాలి కానీ నవీన్ కాదనడం ఏంటి అనే విపరీత మనస్తత్వం తో ఈ పని చేయించింది.

ఇక హరిహర ,నిహారికతో ఉన్నది ప్రేమ అనుకుని తనకోసం తన స్నేహితుడిని చంపేశాడు. నీహారిక , హరిహర, హాసన్ వీళ్ళు ముగ్గురు అమాయకులైతే కాదు. వీళ్లకు హత్య చేస్తున్నామనే విచక్షణ ఉంది. ఒకవేళ హరిహరకు బయపడి నిహారిక అతడికి డబ్బు ఇచ్చింది అనుకున్న మళ్ళీ హత్య జరిగిన చోటుకి పోయి అక్కడ చూడటం తరువాత రెస్టారెంట్ కి పోయి తినడం ఇవన్నీ సైకో లక్షణాలు. వీళ్ళ ముగ్గురు అలానే ఉన్నారు అంటూ అభిప్రాయపడ్డారు కృష్ణ కుమారి . పోలీసులకే షాక్ ఇచ్చేలా హత్య జరిగాక సాక్ష్యాలు లేకుండా చేయడానికి ఫోన్లు ధ్వంసం చేయడం శవాన్ని తగులబెట్టడం వంటివి చేసారు ఇవన్నీ యూట్యూబ్ లోనూ ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్ లలోనూ చూసి నేర్చుకున్నవి అంటూ అభిప్రాయపడ్డారు కృష్ణ కుమారి.

































