Social Activist Krishna Kumari : ఆడవారి గురించి అసభ్యంగా మాట్లాడేవారిని కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అయ్యారు సామాజిక వేత్త కృష్ణకుమారి. ఇక ఆడవారి గురించి అనుచితంగా మాట్లాడి బాగా వైరల్ అవుతున్నాడు యోగా గురు రామ్ దేవ్ బాబా. మహారాష్ట్ర థానే లో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో వేదికమీద మాట్లాడుతూ రామ్ దేవ్ బాబా ఆడవారు చీరల్లో అందంగా ఉంటారు సల్వార్ లోనూ అందంగా ఉంటారు అసలు నా దృష్టిలో బట్టలు లేకున్నా అందంగా ఉంటారు అంటూ అనుచిత వాఖ్యలు చేసారు. అదే సభలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కూడా ఉంటం గమనార్హం. ఇక ఈ వాఖ్యలకు చాలా మంది నెటిజన్స్ మరియు దేశవ్యాప్తంగా మహిళా సంఘ నేతలు ఆయనను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక అంశం మీద సామాజిక వేత్త కృష్ణకుమారి కూడా మాట్లాడారు రామ్ దేవ్ బాబా మీద ఫైర్ అయ్యారు.

ఆ వెధవని బట్టలుప్పి కొట్టాలి… శిక్షించాలి…
కృష్ణ కుమారి గారు మాట్లాడుతూ మహిళల పట్ల అలాంటి అనుచిత వాఖ్యలు చేసిన ఆ బాబా రామ్ దేవ్ ను బట్టలు విప్పి కొట్టాలి. ఇలాంటి వాళ్ల బాబాలుగా బోధనలు చేస్తే జనాలు వింటున్నారు. ఇతన్ని మళ్ళీ బీజేపీ ప్రభుత్వం యోగా కి గురు అన్నట్లు క్రియేట్ చేసింది, ఒక మతానికి ఆపాదించి ఓటు రాజకీయాల కోసం ఇలాంటి వాళ్ళను నెత్తిన పెట్టుకుంది అంటూ చెప్పారు. ఇక అలాంటి కామెంట్స్ మహిళల పట్ల చేస్తున్నా పక్కనున్న మహిళలు అదికూడా ఉప ముఖ్యమంత్రి భార్య చూస్తూ ఉండిపోవడం మిగిలిన వారు చప్పట్లు కొట్టడం ఎంత అసహ్యంగా ఉంది.

అంటే ఇలాంటి వాఖ్యలు చేసినా ఆడవారు భరించాలి, మహిళలను కేవలం శృంగారానికి మాత్రమే అని మాట్లాడినా మౌనంగా ఉండాలి. ఇక మన దేశంలో అత్యాచారాలు జరిగినా ఆ రాత్రి టైములో ఆడపిల్లకు బయట ఏమి పని అంటూ మాట్లాడుతారు లేదంటే అలాంటి బట్టలు వేసుకుంటే అలానే రేప్ చేస్తారు అంటూ మాట్లాడుతారు. ఇలాంటి వాళ్లందరినీ స్త్రీలను కించపరిచి మాట్లాడినా అది నేరమే నిర్భయ చట్టం కింద కేసు పెట్టొచ్చు అంటూ చెప్పారు. ఇక ఆ రామ్ దేవ్ బాబా బ్రాహ్మచారి అంటూ చెప్పుకుని తిరుగుతాడు ఇలాంటి వాఖ్యలు ఎలా చేయగలడు. ఇతని మీద నిర్భయ చట్టం కింద కేసు పెట్టి జైలుకి పంపించాలి అంటూ ఫైర్ అయ్యారు కృష్ణ కుమారి.































