Social Activist Krishna Kumari : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల్ల వ్యవహారం ప్రతిసారి ఏపీ రాజకీయాల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది. ప్రత్యర్థులకు ఇదొక మంచి ఆయుధమే కావొచ్చు. కానీ దీని వల్ల నిరంతరం ఆయన భార్యల గురించి ముఖ్యంగా రేణు దేశాయ్ గురించి చర్చ నడుస్తోంది. ఇక రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పవన్ అభిమానులు ఆమెను విపరీతంగా ట్రోల్ చేసారు. ఆమె రెండో పెళ్లి చేసుకోకూడదు అన్నట్లు మాట్లాడారు. ఇదే విషయం మీద సామజిక వేత్త కృష్ణ కుమారి మాట్లాడుతూ రేణు దేశాయ్ కి అండగా నిలబడ్డారు. ఆమె మాట్లాడిన మాటలను రేణు దేశాయ్ కోట్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టుకోవడం విశేషం.

ఆ పని చేసుంటే పవన్ జైలుకి వెళ్ళేవాడు…
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరూ బద్రీ సినిమా సమయంలో ప్రేమించుకున్నారు. మొదట్లో సహజీవనం చేసిన వారిద్దరికీ బాబు పుట్టాడు. అకిరా పుట్టాక పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మరో పాప పుట్టాక విడాకులను తీసుకున్నారు. పిల్లల బాధ్యత రేణు దేశాయ్ తీసుకున్నారు. అయితే పవన్ వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకున్నా రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటారు అన్నపుడు మాత్రం పవన్ ఫ్యాన్స్ ఆమె మీద ఇప్పటికీ నీవు మా వదినవే నువ్వు పెళ్లి చేసుకోకూడదు అంటూ ట్రోల్ చేసారు. ఇదెక్కడి న్యాయం అంటూ కృష్ణ కుమారి అభిప్రాయపడ్డారు.

సహజీవనం చేసి బిడ్డను కన్న రోజు రేణు దేశాయ్ ఒక్క మాట పవన్ తో నాకు పెళ్లి అయింది అని ఒక్కమాట అనుంటే ఆరోజే పవన్ జైలుకి వెళ్ళేవాడు కానీ రేణు దేశాయ్ అలా చేయలేదు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటే ఒప్పుకోరు. వాళ్ళ హీరో మాత్రం మరో పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లల్ని కనొచ్చు ఇదేం వ్యవహారం. సమాజంలో ఇలాంటి ఘటనల్లో ఎపుడూ ఆడవాళ్లే బలవ్వుతారు. మగవాళ్లకు ఉన్న స్వేచ్ఛ, న్యాయం ఆడవాళ్లు కోరుకోకూడదు అంటూ అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో కోట్ చేయడం విశేషం.


































